కన్నప్ప కోసం వెయిటింగ్‌.. వారి కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్! | Manchu Manoj Tweet On Kannappa Movie Ahead Of Release | Sakshi
Sakshi News home page

Manchu Manoj: కన్నప్పకు ఆల్ ది బెస్ట్‌.. వారిని చూసేందుకు ఆసక్తిగా ఉన్నా!

Jun 26 2025 3:24 PM | Updated on Jun 26 2025 3:46 PM

Manchu Manoj Tweet On Kannappa Movie Ahead Of Release

కన్నప్ప టీమ్‌కు మంచు మనోజ్ ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే కన్నప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్‌ ఎన్నో ఏళ్లు ఎంతో  కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్‌ ఛాంప్స్‌ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ ద్వారా మనోజ్ ఆల్‌ ది బెస్ట్ చెప్పారు.

మంచు మనోజ్ తన ట్వీట్‌లో రాస్తూ..' కన్నప్ప చిత్రానికి, టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌. ఈ సినిమా కోసం నాన్నతో పాటు ఆయన బృందం ఎంతో శ్రమించారు. ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా లిటిల్‌ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్‌ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని.. ఈ  శుక్రవారమే కన్నప్ప విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్‌,  మోహన్‌లాల్‌ , అక్షయ్‌కుమార్‌, ప్రభుదేవాతో పాటు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరు సినిమా కోసం చేసిన చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. మంచు మనోజ్ ఇటీవలే భైరవం మూవీతో అభిమానులను అలరించారు. అయితే ఈ ట్వీట్‌లో ఎక్కడూ కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement