అన్నా.. అంటూ వీడియో షేర్‌ చేసిన మంచు మనోజ్‌.. గొడవలకు ఫుల్‌స్టాప్‌ | Manchu Manoj Comments On His VISHNU Son Winning Award For Kannappa Movie | Sakshi
Sakshi News home page

అన్నా.. అంటూ పోస్ట్‌ పెట్టిన మంచు మనోజ్‌.. గొడవలకు ఫుల్‌స్టాప్‌

Aug 18 2025 7:38 AM | Updated on Aug 18 2025 9:06 AM

Manchu Manoj Comments On His VISHNU Son Winning Award For Kannappa Movie

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన 'కన్నప్ప' (Kannappa) కొద్దిరోజుల క్రితం విడుదలై మెప్పించింది. ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు కుమారుడు అవ్రామ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అయితే, కన్నప్పలో అవ్రామ్‌ నటనకు గాను సంతోషం ఫిల్మ్‌ అవార్డ్స్‌లో తాజాగా  అవార్డు దక్కింది. దీంతో మోహన్‌బాబుతో పాటు విష్ణు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అవ్రామ్‌ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ.. మరోసారి మీ ముందుకు తప్పకుండా వస్తానని తెలిపాడు. మంచు ఫ్యామిలీ సంతోషాన్ని మనోజ్‌ ఒక పోస్ట్‌ చేసి రెట్టింపు చేశాడు.

ప్రత్యేకంగా తన అన్న మంచు విష్ణును ట్యాగ్‌ చేసి మనోజ్‌ ఇలా చెప్పాడు.. 'అభినందనలు అవ్రామ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నువ్వు ఎప్పటికీ ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలి నాన్నా. ప్రత్యేకంగా నువ్వు  విష్ణు అన్నతో పాటుగా నాన్నగారు మోహన్‌బాబుతో అవార్డు అందుకోవడం చాలా స్పెషల్‌..' అంటూ పోస్ట్‌ చేశాడు.  కన్నప్ప విడుదల సమయంలో కూడా సినిమా చూసిన మనోజ్‌ తన అన్న గురించి ఒక పోస్ట్‌ చేశాడు. సినిమా చాలా బాగుందని తాను అనుకున్న దానికంటే వెయ్యి రెట్లు బాగా వచ్చిందని చెప్పాడు. కన్నప్పలో తన అన్న ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని తెలిపాడు.

కొంతకాలంగా మంచు ఫ్యామిలీ గొడవలు  ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఏకంగా పోలీస్టేషన్‌కు చేరాయి. ఇలాంటి సమయంలో  మంచు విష్ణు పేరు కోట్‌ చేస్తూ మనోజ్‌ పోస్ట్‌ పెట్టడంతో ఫ్యాన్స్‌ కూడా సంతోషిస్తున్నారు. రక్తసంబంధం అంటే ఇలాగే ఉంటుందని ఎన్ని గొడవలు పడినా ఎదోరోజు కలుసుకుంటారని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement