
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
హర్టయిన మంచు విష్ణు!
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్‌తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్‌ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.
మీమ్స్ వాడాం..
శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్‌ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్‌లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.
క్షమించండి: శ్రీ విష్ణు
ఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.