శ్రీ విష్ణు 'సింగిల్' ట్రైలర్ రిలీజ్.. బుల్లిరాజు కూడా | Sree Vishnu Single Movie Trailer | Sakshi
Sakshi News home page

#Single Trailer: రొమాంటిక్ కామెడీగా 'సింగిల్'.. ట్రైలర్ చూశారా?

Apr 28 2025 3:50 PM | Updated on Apr 28 2025 4:11 PM

Sree Vishnu Single Movie Trailer

తెలుగు హీరోల్లో శ్రీ విష్ణు కాస్త డిఫరెంట్ మూవీస్ చేస్తూ అలరిస్తుంటాడు. గతేడాది 'స్వాగ్' అనే ప్రయోగాత్మక సినిమా చేశాడు. కానీ ఇది జనాలకు నచ్చలేదు. దీంతో తనకు అచ్చొచ్చిన కామెడీనే మళ్లీ నమ్ముకున్నాడు. అలా చేసిన మూవీ 'సింగిల్'.

(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)     

మే 9న రిలీజ్ కాబోతున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. దీనిబట్టి చూస్తే.. సింగిల్ గా ఉండే శ్రీ విష్ణు జీవితంలోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. తర్వాత వాళ్లతో ప్రేమ, రొమాన్స్, గొడవలు.. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

ట్రైలర్ లో కామెడీ బాగుంది. జోకులు బాగానే పేలాయి. చూస్తుంటే శ్రీ విష్ణు మరో హిట్ కొడతాడేమో అనిపిస్తుంది. రీసెంట్ గా వైరల్ అయిన బుల్లిరాజు అలియాస్ రేవంత్ ఈ సినిమాలోనూ నటించాడు. గీతా ఆర్ట్స్ సంస్థ దీన్ని నిర్మించగా.. కార్తీక్ రాజ్ దర్శకుడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా?)      

Advertisement
 
Advertisement
Advertisement