మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల? | Actress Sreeleela Adopted Another Kid | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల కుటుంబంలోకి మరో పాప.. పోస్ట్ వైరల్

Apr 28 2025 2:22 PM | Updated on Apr 28 2025 2:56 PM

Actress Sreeleela Adopted Another Kid

శ్రీలీల(Sreeleela) పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. అప్పట్లో పల్సర్ బండి పాటకు.. రీసెంట్ గా పుష్ప 2లో(Pushpa 2 Movie) కిస్సిక్ అంటూ స్టెప్పులేసి అదరగొట్టేసింది. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈమె గురించి ఇప్పుడో విషయం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?

తెలుగు మూలాలున్న అమ్మాయి శ్రీలీల. పుట్టి పెరిగింది అమెరికాలో గానీ ప్రస్తుతానికైతే బెంగళూరులో తల్లితో కలిసి ఉంటుంది. షూటింగ్ లేనప్పుడు తన ఇంట్లో చేసే అల్లరిని అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్టింగ్ పరంగా శ్రీలీలపై చిన్న చిన్న విమర్శలు వస్తుంటాయి. ఓ విషయంలో మాత్రం ఈమె అందరి మనసులు దోచేసింది.

(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్ 

ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల.. ఓవైపు హీరోయిన్ గా చేస్తోంది. ఇది అందరికీ తెలుసు. కానీ 2022లో ఓ అనాథశ్రమాన్ని సందర్శించినప్పుడు.. దివ్యాంగులైన గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల పరిస్థితి చూసి చలించిపోయింది. వాళ్లని దత్తత తీసుకుంది(Adopted). వాళ్ల ఆలనపాలన చూసుకుంటోంది.

తన కుటుంబంలోకి మరో పాప వచ్చిందని శ్రీలీల తాజాగా పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ చిన్న పాపకు ముద్దులు పెడుతూ కనిపించింది. నెటిజన్ల అయితే ఈ పాప ఎవరా అని మాట్లాడుకుంటున్నారు. కొందరు మాత్రం మరో బిడ్డని దత్తత తీసుకుంది అని అంటున్నారు. లేదంటే బంధువులమ్మాయి అనేది శ్రీలీల చెబితే గానీ క్లారిటీ రాదు.

(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)   

Advertisement
 
Advertisement
Advertisement