సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్ | Naga Chaitanya Shares Pet Dog Hash Pics With Sobhita Dhulipala, Netizens Comments Went Viral | Sakshi
Sakshi News home page

Samantha Sobhita: చాన్నాళ్లకు చైతూ పోస్ట్.. సామ్ ఫ్యాన్స్ కామెంట్స్ మాత్రం ‍

Apr 27 2025 4:57 PM | Updated on Apr 27 2025 6:48 PM

Naga Chaitanya Shares Pet Dog Hash Pics With Sobhita

నాగచైతన్య-సమంత బంధం ముగిసిన అధ్యయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున‍్నారు. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతూ పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు.

సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య.. గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉండే చైతూ చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి

సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు. ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది. తాజాగా చైతన్య.. ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత- పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.

అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్.. చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. సామ్ పెంచుకున్న కుక్క.. శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.. 'శుభం' ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు

Advertisement
 
Advertisement
Advertisement