
ఓటీటీల జమానా పెరిగిన తర్వాత థియేటర్లలో చెప్పలేని, చూపించలేని కొన్ని స్టోరీలని సినిమాలు, వెబ్ సిరీసులుగా తీస్తున్నారు. అలా గతేడాది తమిళంలో రిలీజైన ఓ బోల్డ్ మూవీ.. ఇప్పుడు తెలుగులో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇంతకీ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?
సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'ష్'ని గతేడాది రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ ఆహా, అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ ని ఆహా ఓటీటీలోనే ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ)
'ష్' మూవీ నాలుగు కథల సమాహారం. ఇందులో లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని చూపించారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. మిడిల్ ఏజ్ రొమాన్స్ తదితర స్టోరీలతో ఈ సినిమాని తీశారు. పృథ్వీ ఆదిత్య, వాలి మోహన్ దాస్, హరీష్, కార్తీకేయన్ దర్శకత్వం వహించారు.
గతంలో నెట్ ఫ‍్లిక్స్ లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ సినిమా తీశారు. కాకపోతే ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ ఏం లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు టాక్ వచ్చింది. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)