ఓటీటీలో మరోసారి మ్యాజిక్ చేస్తారా? | Gram Chikitsalay Series OTT Streaming Details | Sakshi
Sakshi News home page

OTT: 'పంచాయత్' మేకర్స్ నుంచి మరో క్రేజీ సిరీస్

Apr 28 2025 3:04 PM | Updated on Apr 28 2025 3:40 PM

Gram Chikitsalay Series OTT Streaming Details

ఇప్పుడంటే కాస్త తగ్గింది గానీ లాక్ డౌన్ టైంలో ఓటీటీల్లో సినిమాలు-సిరీస్ లని అని తెగ చూసేశారు. ఆ టైంలో కొన్ని మూవీస్, సిరీసులు.. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో ఒకటే 'పంచాయత్'. ఇప్పుడు దీన్ని తీసిన మేకర్స్ నుంచి మరో సిరీస్ రాబోతుంది.

పంచాయత్ సిరీస్ గురించి చెప్పుకొంటే.. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు, మారుమూల పల్లెటూరికి పంచాయతీ సెక్రటరీగా వస్తాడు. ఇక్కడ వాతావరణం, మనుషులు, పరిస్థితుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేదే కథ. సున్నితమైన హాస్యం, పల్లె వాతావరణంలో తీసిన ఈ సిరీస్ 2020లో రిలీజై సూపర్ హిట్ ‍అయింది. తర్వాత మరో రెండు సీజన్లు కూడా వచ్చాయి.

(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)    

ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు.. 'గ్రామ చికిత్సాలయ' అనే సిరీస్ ప్రకటించారు. మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేసి మరీ వెల్లడించారు. ఓ పల్లెటూరిలో చిన్న హాస్పిటల్, అందులో ఉండే డాక్టర్.. దీని బ్యాక్ డ్రాప్ స్టోరీ అనిపిస్తుంది. ఇందులోనూ ఫన్ తగ్గదని తెలుస్తోంది.

అయితే పంచాయత్ సిరీస్ ఓటీటీలో సూపర్ హిట్. దీన్ని తెలుగులో 'సివరపల్లి' పేరుతోనూ రీమేక్ చేస్తే ఇక్కడ కూడా ఆకట్టుకుంది. మరి ఇప్పుడు గ్రామ చికిత్సాలయ సిరీస్ తో వస్తున్నారు. మరి ఈసారి కూడా కంటెంట్ తో మ్యాజిక్ చేసి హిట్ కొడతారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మరో పాపని దత్తత తీసుకున్న శ్రీలీల?)    

Advertisement
 
Advertisement
Advertisement