'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే? | Rajinikanth Watched Kannappa Movie And Reaction | Sakshi
Sakshi News home page

Kannappa: 22 ఏళ్లుగా దీనికోసమే ఎదురుచూశా.. మంచు విష్ణు పోస్ట్

Jun 16 2025 4:09 PM | Updated on Jun 16 2025 4:18 PM

Rajinikanth Watched Kannappa Movie And Reaction

మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొచ్చిలో ఆ ఈవెంట్ చేసి కొంతమేర మలయాళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు తమిళ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో విష్ణు ముందుకొచ్చాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి సినిమా చూపించారు. దీంతో ఆయన తన అభిప్రాయాన్ని విష్ణుతో చెప్పగా.. ఆ విషయాన్ని వీడియో, ట్వీట్ రూపంలో విష్ణు బయటపెట్టాడు.

మంచు ఫ్యామిలీకి రజినీకాంత్ సన్నిహితంగా ఉంటారు. గతంలో మోహన్ బాబుతో కలిసి 'పెదరాయుడు' సినిమాలో రజినీ నటించారు. తాజాగా ఆదివారంతో ఆ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఆ చిత్ర సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు 'కన్నప్ప' సినిమాని కూడా అందరూ కలిసి వీక్షించారు. ఈ క్రమంలోనే రజినీకాంత్.. తనని హత్తుకుని మెచ్చుకున్నారని విష్ణు తెగ ఆనందపడిపోతున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

'రజినీకాంత్ అంకుల్ 'కన్నప్ప' సినిమా నిన్న రాత్రి చూశారు. పూర్తయిన తర్వాత నాకు గట్టిగా హగ్ ఇచ్చారు. మూవీ చాలా నచ్చిందని నాతో చెప్పారు. ఓ నటుడిగా ఈ హగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. దీంతో ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది' అని మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు.

'కన్నప్ప'లో విష్ణు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?)

Advertisement
 
Advertisement
Advertisement