‘సూపర్‌ సిక్స్‌ కాదు.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌’ | ysrcp Buggana Rajendranath Satirical Comments On CBN Govt | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ సిక్స్‌ కాదు.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌’

Jun 15 2025 11:36 AM | Updated on Jun 15 2025 12:50 PM

ysrcp Buggana Rajendranath Satirical Comments On CBN Govt

సాక్షి, హైదరాబాద్‌: తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామన్నారు, ఏమైంది?. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కార్‌ మహా మోసం చేస్తోంది. రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇచ్చారా?.

మీకు 15వేలు, మీకు 18వేలు ఇస్తామని ఎన్నికల ముందు బీరాలు పలికారు. మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ఇస్తామన్నారు.. ఏమైంది?. మహిళలకు ఉచిత బస్సు ఇంకా ఎప్పుడు ఇస్తారు?. అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్న రూ.20వేలు ఎక్కడ?. రాష్ట్రంలో దాదాపు 88 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాలి. సవాలక్ష ఆంక్షలతో పిల్లల సంఖ్య 66 లక్షలకు తగ్గించే కుట్ర చేస్తున్నారు. రాష్ట్ర ఖనిజ సంపదను రూ.9 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో జరిగే కార్యక్రమాలు జరగడం లేదని ప్రజలు అంటున్నారు. సూపర్‌ సిక్స్‌ ఏమో కానీ.. ఫస్ట్‌ బాల్‌కే కూటమి ఔట్‌ అని సెటైర్లు వేశారు. 

ప్రశ్నలు చంద్రబాబుకు నచ్చవు.. 
ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు ఇష్టం ఉండదు. అది ప్రజలు అయినా ప్రతిపక్షం అయినా సరే. ఆర్థికశాఖ మీరే రివ్యూ చేస్తే మరి ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు. ఏపీఎండీసీని శాశ్వతంగా తాకట్టు పెట్టారు. ఎన్నికల ముందు ఇంటి ఇంటికి వెళ్లి అబద్దాలు చెప్పారు. అధికారం లోకి వస్తే ఒకటికి నాలుగురెట్లు హామీలు ఇస్తామన్నారు. ఇప్పుడిపుడే ప్రజలకు మొత్తం అర్ధం అవుతుంది. మీరు చెప్పింది చేయక పోతేనే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

ఇప్పుడు శ్రీలంక కావడం లేదా?
మా హయాంలో ఒక పథకం ఒకరోజు ఆలస్యం అయితే మీడియా హడావుడి చేసింది. మరి ఇప్పుడు ఏమైంది ఒక్కరూ ప్రశ్నించరు. ఇప్పుడు మీరు మాకంటే ఎక్కువ అప్పులు చేస్తుంటే శ్రీలంక అవడం లేదా?. సంక్షేమ పథకాల్లో పీపీపీ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావట్లేదు. పథకాల పేర్లు అయితే బాగుంటాయి. కానీ ఒక్కటి నెరవేరదు. టీడీపీకి పునాది సినిమా ఫీల్డ్ అందుకే పథకాల పేర్లు బాగుంటాయి. యువగలం పేరుతో యువకులను మోసం చేశారు. 20 లక్షల మంది యువకులను మోసం చేశారు. పోయిన బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయించినట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. మరి ప్రజలకు ఇచ్చారా?. ఆస్తి పోయినా ఆరోగ్యం పోయిన సంపాదించుకోవచ్చు. చంద్రబాబు ప్రతీసారి మోసాలతో క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. బడ్జెట్ బుక్కులో ఎంత అప్పు ఉందనే సమాచారం కూడా పెట్టలేదు.  

ప్రశ్నిస్తాన్న వ్యక్తి ఎక్కడ?
మేము ఎం చేస్తామో అది చెప్తాం. మీరేమో ఇవ్వబోతున్నాం.. రాబోతుంది అని చెబుతారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మరీ మేము.. ప్రతి నెల ఒక పథకం అమలు చేశాం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినపుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పారు.  మాకంటే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయా?. కరోనా కూడా ఏమి లేదు కదా. మీ బడ్జెట్‌కు మా బడ్జెట్‌కు తేడా 10వేల కోట్లే. కానీ మీ డబ్బంతా ఎటు పోయింది?. ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. ప్రశ్నిస్తా అన్న వ్యక్తి ఎటు పోయాడు.

బయట వ్యాపారం జరగడం లేదు. సాయంత్రం 7 గంటలకే షాపులు అన్ని బంద్‌ అవుతున్నాయి. రాత్రి అయినా కూడా వెలుగులతో నడిచేది వైన్ షాప్ మాత్రమే. ఏపీ లో ప్రజలు మల్లి అప్పుల్లో మునుగుతున్నారు. మళ్లీ కాల్ మనీ వ్యవహారం జరుగుతుంది. వ్యాపారాలు లేక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టిలో వైఎస్సార్‌సీపీ హయంలో చివరి ఏడాది పది శాతం సంపద పెంచాం. మీరు మూడు శాతం పెంచారు. మరి ఎవరిది సంపద సృష్టి.  అప్పు మాత్రం 30 శాతం పెంచారు. జీఎస్టీ వసూళ్ళలో కూడా 24 శాతం తగ్గింది. కానీ, చరిత్రలో అత్యధిక జీఎస్టీ వసూలు అని అబద్దాలు చెప్తున్నారు.

ఉద్యోగులకు మోసం.. 
ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా మోసం చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను వాడుకుంది. రాష్ట్ర విభజన జరిగినపుడు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్‌లో 2014 ఏడాదికి 32,990 కోట్లు ఉండగా అందులో ఆంధ్ర భాగం 19,130 కోట్లు దక్కింది. దాన్ని కాస్త చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేసరికి అది 76,516 కోట్లకి పెంచారు. మా ప్రభుత్వం దిగిపోయేసరికి దాన్ని 76,038 కోట్లకు తగ్గించాం. 478 కోట్లు మేము తిరిగి ఉద్యోగులకు కట్టేశాం. ఇది ఉద్యోగులు బాగా గమనించాలి. దాదాపు 57వేల కోట్లు ఉద్యోగుల డబ్బులు వాడుకుంది బాబు ప్రభుత్వం.

సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు.. 
ఎంతోమంది ప్రముఖ జర్నలిస్టులు వారి అభిప్రాయం తెలియజేస్తారు. కానీ, కొమ్మినేని మీద అంత ద్వేషం ఎందుకు?. ఆయన వయసు చూసైనా బాధ అనిపించలేదా?. మీ కోపాన్ని జర్నలిస్టుల మీద చూపిస్తారా?. జర్నలిస్టుకు ఉండాల్సిన హక్కులు కాపాడాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజా పరిపాలన చేయండి.. అంతేకానీ.. కోపం, ద్వేషంతో కూటమి పాలన నడుస్తోంది. మీటింగ్స్ పెట్టి మరి వైఎస్సార్‌సీపీ ఓటు వేస్తే పథకాలు ఇవ్వద్దని చెప్పడం అన్యాయం. మీరు ఒక్క పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి కాదు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement