జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ | Reliance Jio launches 3 new recharge plans for 84 days | Sakshi
Sakshi News home page

జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ

Jun 13 2025 3:00 PM | Updated on Jun 13 2025 4:20 PM

Reliance Jio launches 3 new recharge plans for 84 days

రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.

జియో రూ.799 ప్లాన్
జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు.  ఇందులో  అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో పొందవచ్చు.

జియో రూ.859 ప్లాన్
ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌తో ఆనందించవచ్చు.

👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్‌.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ

జియో రూ.889 ప్లాన్
జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్‌  ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్‌స్టార్‌కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో చేర్చారు. అలాగే జియో సావన్‌కు కూడా ఉచిత యాక్సెస్‌ను కూడా వినియోగదారులు పొందుతారు.

Advertisement
 
Advertisement
Advertisement