రూ.200 లోపే రీచార్జ్‌.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ | Sim Active Plan BSNL Best recharge plan to keep number active | Sakshi
Sakshi News home page

రూ.200 లోపే రీచార్జ్‌.. 2 నెలలుపైగా వ్యాలిడిటీ

Jun 9 2025 9:03 PM | Updated on Jun 9 2025 9:10 PM

Sim Active Plan BSNL Best recharge plan to keep number active

దేశంలో ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటికీ మొబైల్ కనెక్షన్ చేరింది. మనలో చాలా మందికి రెండు లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉంటాయి. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలతో పాటు చాలా మందికి బీఎస్‌ఎన్‌ఎల్ నంబర్ కూడా ఉంటుంది. అయితే పెరిగిన రీచార్జ్‌ ధరల కారణంగా అన్నింటికీ రీచార్జ్‌ చేయించడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే అద్భుతమైన ప్లాన్‌ బీఎస్ఎన్ఎల్‌లో  ఉంది.

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ పోర్ట్‌ఫోలియోలో అనేక ప్లాన్లు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం కంపెనీ వివిధ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిలో ఓ చౌక ప్లాన్‌ ఉంది. ఇది తక్కువ ఖర్చుతో మీ నంబర్‌ను చాలా రోజులు యాక్టివ్‌గా ఉంచుకునేందుకు సహాయపడుతుంది. అదే రూ .197 ప్లాన్. ఇందులో పరిమిత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. నంబర్‌ యాక్టివ్‌గా ఉంటే చాలు అనుకునేవారికి సరిపోతుంది.

రూ.197 ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ రూ.197 ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజుల వరకు ఉంది. అంటే, ఈ ప్లాన్ మీ కనెక్షన్‌ను 70 రోజులు యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా ఇన్‌కమింగ్ సదుపాయం కూడా కొనసాగుతుంది. ఈ ప్లాన్ ఫీచర్ల విషయానికొస్తే, ఇది 15 రోజుల పాటు అపరిమిత కాలింగ్, రోమింగ్ అందిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు రోజూ 2 జీబీ అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. దీనితో పాటు 15 రోజుల పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

15 రోజుల తర్వాత లోకల్ కాలింగ్ కు నిమిషానికి రూ.1, ఎస్టీడీ కాలింగ్ కు నిమిషానికి రూ.1.3 ఖర్చవుతుంది. వీడియో కాలింగ్ కోసం లోకల్, నేషనల్‌కు నిమిషానికి రూ.2 చెల్లించాలి. ఇక ఎస్ఎంఎస్ విషయానికొస్తే లోకల్ ఎస్ఎంఎస్‌కు 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.20 పైసలు ఖర్చవుతుంది. డేటా విషయానికొస్తే, ఉచిత డేటా ముగిసిన తర్వాత, ఒక్కో ఎంబీకి 25 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement