ఒక్క రూపాయితో 24 రోజుల వ్యాలిడిటీ | BSNL Extends Special Offers Till September 12 With ₹1 SIM And Extra Validity, Here’s What Customers Get | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయితో 24 రోజుల వ్యాలిడిటీ

Aug 16 2026 1:41 PM | Updated on Aug 16 2026 2:46 PM

BSNL Special Offers

సూర్యాపేట : బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్ల గడువును సెప్టెంబర్‌ 12 వరకు పొడిగించినట్లు ఆ సంస్థ ఎస్‌డీఈలు రంజిత్‌ కుమార్, కిషోర్‌ బాబు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల అనంతరం వారు మాట్లాడారు. రూ.1కే సిమ్‌తో పాటు 24 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1జీబి డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ లభించే ప్రత్యేక ఆఫర్‌ను వినియోగదారులు పొందవచ్చన్నారు. 

అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.2,399 ప్లా¯న్‌ను 412 రోజులకు పొడిగించినట్లు వెల్లడించారు. ఈ ప్లా¯న్‌లో రోజుకు 2 జీబి డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత కాల్స్‌ లభిస్తాయన్నారు. 60 ఎంబీపీఎస్‌ అ¯Œన్‌ లిమిటెడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ కేవలం రూ.399కే లభిస్తుందని, ప్రైవేట్‌ టెలికాం ఆపరేటర్లతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సూర్యాపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు లచ్చు నాయక్, జేఈ నారాయణ, రాము సిబ్బంది పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement