చిట్టి గుండె ఆగింది | 11 Year Old Girl Dies Of Heart Condition Ahead Of Independence Day Celebrations In Telangana | Sakshi
Sakshi News home page

చిట్టి గుండె ఆగింది

Aug 16 2026 10:43 AM | Updated on Aug 16 2026 1:19 PM

5th class student ends life heart disease

నిజామాబాద్‌ రూరల్‌ : పంద్రాగస్టు రోజు ఉదయాన్నే లేచి జెండా పండుగను సంబురంగా జరుపుకుందామనుకున్న విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేశాపూర్‌కు చెందిన సుంకె మౌనిక కూతురు సుంకే సాత్విక(11) సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. చిన్నారి గుండెకు గతంలో శస్త్రచికిత్స జరిగింది. కాగా, రెండు రోజుల క్రితం సాతి్వకకు గుండెలో నొప్పి రావడంతో ప్రిన్సిపల్‌ నళిని తల్లికి సమాచారం అందించారు. 

దీంతో మౌనిక తన కూతురిని నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా గతంలో గుండె ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం పరిస్థితి విషమించి సాతి్వక ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. చిన్నారి మృతితో కేశాపూర్‌ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మౌనిక భర్త గతంలోనే మృతి చెందగా, ఉన్న ఒక్కగానొక్క కూతురు మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement