'ది రాజా సాబ్‌పై నెగెటివ్ ‍క్యాంపెయిన్‌'.. నిర్మాత ఎస్‌కేఎన్‌ షాకింగ్ కామెంట్స్! | Producer SKN Comments On The Raja Saab Movie Teaser | Sakshi
Sakshi News home page

SKN: 'ఓ నిర్మాత నెగెటివ్‌ క్యాంపెయిన్‌ చేశారు'.. ఎస్‌కేఎన్ కామెంట్స్ వైరల్!

Jun 16 2025 3:40 PM | Updated on Jun 16 2025 4:26 PM

Producer SKN Comments On The Raja Saab Movie Teaser

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'ది రాజా సాబ్'. రొమాంటిక్‌ హారర్ మూవీగా వస్తోన్న ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ వెయిట్‌ చేస్తున్న రోజు వచ్చేసింది. మన రాజా సాబ్‌ టీజర్‌ విడుదలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కామెడీతో పాటు హారర్‌ థ్రిల్లింగ్‌గా ఉండడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు.

అయితే ఇవాళ నిర్వహించిన టీజర్‌ ఈవెంట్‌కు నిర్మాత ఎస్‌కేఎన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాస్ టీజర్‌తో పాటు సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాకు ఓ నిర్మాత నెగెటివ్ క్యాంపెయిన్‌ చేశారని ఆరోపించారు. ఈ సినిమా మొదలైనప్పుడు నెగెటివ్‌ చేసినా నిర్మాత.. టీజర్ చూశాక రేపటి నుంచి పాజిటివ్‌ ట్రెండ్‌ చేస్తాడు. మారుతి ఎప్పుడూ అలాంటి క్యాంపెయిన్స్‌ను నమ్మలేదు. తన బెస్ట్‌ ఇస్తానని చెప్పాడు. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా షేక్‌ అవుతుంది' ఎస్‌కేఎన్‌ కామెంట్స్ చేశారు. ఇవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇంతకీ ఎవరా? నిర్మాత టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.

(ఇది చదవండి: 'ది రాజాసాబ్‌'.. భయపెట్టడమే కాదు... (టీజర్‌))

ఈ రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌లో  నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement