'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా? | The RajaSaab Telugu Teaser And Prabhas Old Getup | Sakshi
Sakshi News home page

The RajaSaab Teaser: 'రాజాసాబ్' టీజర్‌లో ఇది గమనించారా?

Jun 16 2025 2:58 PM | Updated on Jun 16 2025 3:41 PM

The RajaSaab Telugu Teaser And Prabhas Old Getup

ప్రభాస్ 'రాజాసాబ్' టీజర్ వచ్చింది. ఫుల్ ఆన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. అదే టైంలో వాళ్లకు చిన్న సందేహం కూడా వచ్చింది. అదే తాత గెటప్. ఎందుకంటే చాన్నాళ్ల క్రితం ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్.. ముసలి గెటప్‌లో కనిపించాడు. ఇప్పుడు టీజర్‌లో మాత్రం స్టోరీ అంతా వేరేలా ఉంది. దీంతో ఫ్యాన్స్ రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.

టీజర్ బట్టి చూస్తే.. ఓ పెద్ద మహల్. దానికి యజమాని అయిన ఓ వ్యక్తి.. తరతరాలుగా ఆ మహల్‌తోపాటు ఆస్తిని అనుభవించాలని అనుకుంటాడు. దీంతో చనిపోయిన తర్వాత దెయ్యంగా మారి అక్కడే ఉండిపోతాడు. ఓ సందర్భంలో హీరోహీరోయిన్లు అక్కడికి వస్తారు. తర్వాత జరిగిన పరిణామాలే సినిమా స్టోరీ అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)

టీజర్ మొత్తంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ని తాతగా చూపించారు. కానీ గతంలో ప్రభాస్‌ని ముసలి గెటప్‌లో చూపించారు. దీంతో ఫ్యాన్స్ పలు థియరీలు అనుకుంటున్నారు. ఆత్మ రూపంలో ఉండే తాత.. క్లైమాక్స్‌లో ప్రభాస్ శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ప్రభాస్.. తాతలా మారిపోయి విలన్స్‌ని చితక్కొట్టేస్తాడు అని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమేంటి? అనేది సినిమా వస్తే తప్పితే క్లారిటీ రాదు.

ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించగా.. మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇంకొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసుకుని ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సినిమాని తీసుకురాబోతున్నారు.

(ఇదీ చదవండి: ప్రభాస్‌.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి)

Advertisement
 
Advertisement
Advertisement