
మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'కన్నప్ప'. జూన్ 27న థియేటర‍్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టిన విష్ణు.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన కుటుంబం విషయాలు, ప్రభాస్ తో బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ అయిపోయాయి.
(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)
ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు.. 'నేను, ప్రభాస్ బాగా క్లోజ్. అతడు ఎంత గొప్ప నటుడో అతడికి కూడా తెలియదు. ప్రభాస్ లా చాలా తక్కువమంది ఉంటారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా సింపుల్ గా ఉండటం అతడి గొప్పతనం. మేం ఎప్పటికీ సోదరులమే'
'రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటప్పుడు.. ప్రభాస్-నేను రక్తం పంచుకుని పుట్టలే కానీ నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు.
తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. 'మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. దాని కోసం ఏదైనా చేస్తాను. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినరోజు నేను బతికున్నా చచ్చినట్లే. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయను' అని విష్ణు తన కుటుంబ సమస్యల గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.
(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్)