పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్‌ డాజ్లింగ్‌ లుక్‌ | Newlyweds, Akhil Akkineni-Zainab Makes First Post-Wedding Appearance, She Dazzles In A Floral Gown | Sakshi
Sakshi News home page

Akhil -Zainab: పెళ్లి తరువాత తొలిసారి జంటగా : డాజ్లింగ్‌ లుక్‌లో అఖిల్- జైనబ్‌

Jun 9 2025 1:09 PM | Updated on Jun 9 2025 4:28 PM

Newlyweds, Akhil Akkineni-Zainab Makes First Post-Wedding Appearance, She Dazzles In A Floral Gown

మోస్ట్‌ అడోరబుల్‌ సెలబ్రిటీ కపుల్‌ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్‌లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.

సూఫీ రాత్రిలో అఖిల్-  జైనాబ్ అద్భుతంగా
సెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్‌తో ఉన్న లాంగ్‌ ఫ్రాక్‌ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్‌ నెక్‌పీస్‌తో తన లుక్‌ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్‌ ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ స్పెషల్‌గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.

అఖిల్ - జైనబ్ వెడ్డింగ్‌ 
2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్‌రిసెప్షన్‌ కూడా ఇచ్చారు. మహేష్‌ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement