స్వతహాగా కన్నడ అయినప్పటికీ తెలుగులోనూ హీరో, సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా చిన్న కూతురు.. విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని బయటపెట్టగా.. ఇప్పుడు పెళ్లి ఫొటోలని పంచుకుంది. ఈనెల 19న ఈ శుభకార్యం విదేశాల్లోనే జరిగింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి విజయ్ సేతుపతి 'బత్తా' సినిమా.. అసలు మిస్ అవ్వొద్దు)
అర్జున్ 1988లో నటి నివేదితని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, అంజన అని ఇద్దరమ్మాయిలు పుట్టారు. ఐశ్వర్య హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. ఈమె తమిళ నటుడు ఉమాపతి రామయ్యని గతేడాది పెళ్లి చేసుకుంది. చిన్న కూతురు అంజన.. సర్జా వరల్డ్ పేరుతో ఓ కంపెనీ స్థాపించి, దానికి సీఈవోగా వ్యవహరిస్తోంది.
అయితే అమెరికాలో చదువుకుంటున్న టైంలో ఇసాయ్ నట్టర్ అనే కుర్రాడితో ప్రేమలో పడింది. ఇప్పుడు 14 ఏళ్ల ప్రేమని మరో మెట్టు ఎక్కిస్తూ పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోనే పెళ్లి జరిగినప్పటికీ హిందూ సంప్రదాయం ప్రకారం ఈ తంతు జరగడం విశేషం. ఈ ఫొటోలు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుండగా కొత్త జంట మెరిసిపోతూ కనిపించారు.
(ఇదీ చదవండి: 'గరివిడి లక్ష్మి'లో అదంతా చూపిస్తున్నారని నాకు చెప్పలేదు: ఆర్నీ పట్నాయక్)









