స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్రైజర్స్ హైదరాబాద్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో రూమర్స్ వచ్చినప్పుడు కొందరు నమ్మారు, మరికొందరు నమ్మలేదు. కానీ ఇప్పుడు అధికారికంగానే పెళ్లి పనులు మొదలైపోవడంతో సోషల్ మీడియాలో ఈ విషయం కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే అనిరుధ్ పెళ్లి గురించి ఓ జ్యోతిష్యురాలు పదేళ్ల క్రితం ఓ విషయం చెప్పింది. ఇప్పుడు అదే నిజమైందని మీకు తెలుసా?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
అనిరుధ్ ప్రస్తుతం దేశంలో టాప్ మోస్ట్ సంగీత దర్శకుడిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ పదేళ్ల క్రితం ఓ మాదిరి గుర్తింపు ఉన్న టైంలో ఓ తమిళ షోలో పాల్గొన్నప్పుడు.. ఓ టాడో రీడర్(జ్యోతిష్యురాలు) ఇతడి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నాలుగు విషయాలు చెప్పింది. ఇప్పుడు అవే నిజమయ్యాయి.
ఎంబీఏ చేసిన అమ్మాయి.. టెలీ కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ రంగంలో ఉన్న అమ్మాయి.. పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లి.. ఇంటికి 2-4 కిలోమీటర్ల దూరంలో ఉండే అమ్మాయినే అనిరుధ్ పెళ్లి చేసుకుంటాడని సదరు జ్యోతిష్యురాలు అప్పట్లో చెప్పింది. ఇప్పుడు ఆ పాయింట్లన్నీ కూడా కావ్య మారన్కి సరిపోలడం యాద్ధృచ్చికమనే చెప్పొచ్చు. దీంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.
అనిరుధ్ విషయానికొస్తే.. సూపర్స్టార్ రజనీకాంత్తో ఇతడికి దగ్గర బంధుత్వం ఉంది. రజనీ భార్య, అనిరుధ్ తల్లి అక్కాచెల్లెలు అవుతారు. మరోవైపు కావ్య మారన్.. కరుణానిధి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇలా తమిళనాడులోని రెండు ప్రముఖ ఫ్యామిలీస్.. ఈ పెళ్లితో ఒక్కటి కాబోతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ, ఏపీ-తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులకు వివాహ ఆహ్వానాలు అందాయి. రిసెప్షన్ వచ్చే నెల 21న చెన్నైలో జరగనుంది. కానీ పెళ్లి ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ)


