రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ | Rashmika Shares Asks Vijay Deverakonda For Wedding Entire Year | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda Rashmika: విరోష్ మ్యారేజ్ ప్రపోజల్ స్టోరీ.. ఇంత జరిగిందా?

Oct 18 2026 3:58 PM | Updated on Oct 18 2026 4:18 PM

Rashmika Shares Asks Vijay Deverakonda For Wedding Entire Year

టాలీవుడ్ ప్రేమజంట రష్మిక-విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తలుగా కలిసి సినిమా కూడా చేశారు. అదే 'రణబాలి'. ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. మూవీ ప్రమోషన్లలో భాగంగా తెగ తిరిగేస్తున్న ఈ జంట.. తన పెళ్లి ప్రపోజల్ స్టోరీ ఏంటనేది బయటపెట్టింది. స్వయంగా రష్మిక జరిగిందంతా చెప్పింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

'రణబాలి' ప్రమోషన్లలో భాగంగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో విజయ్-రష్మిక పాల్గొన్నారు. ప్రపోజల్ ఏమైనా చేసుకున్నారా? అని హోస్ట్ కరణ్ జోహర్ అడగడంతో.. విజయ్ జరిగింది చెప్పాడు. రష్మిక వచ్చి పెళ్లి చేసుకుందాం అని అడిగిందని.. కానీ నేనే 100 సార్లు అడగమని చెప్పినట్లు పేర్కొన్నాడు. పక్కనే ఉన్న రష్మిక దీని గురించి మాట్లాడుతూ.. పెళ్లి కోసం విజయ్ ఏకంగా ఏడాదిపాటు తనని తిప్పించుకున్నాడని చెప్పుకొచ్చింది.

ఇక రష్మిక కాకుండా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిన మరో హీరోయిన్ ఎవరు? అని విజయ్‌ని కరణ్ అడగ్గానే.. 'ఎవరూ కాదు' అని పక్కనే ఉన్న రష్మిక చెప్పింది. దీంతో స్పందించిన విజయ్.. భార్య ఏం చెబితే అదే ఫైనల్ అని రష్మికని ఫాలో అయిపోయాడు. ఇలా ప్రోమో సరదాగా సాగిపోయింది. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్.. వచ్చే బుధవారం అంటే అక్టోబర్ 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

(ఇదీ చదవండి: అందంగా ఉన్నా గానీ భయపడ్డా: హీరోయిన్ నివేదా థామస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement