నా ముఖం ఉబ్బినట్లు ఉందని.. ఏడాదిగా గ్యాలరీలో..: హీరోయిన్‌ | Nivetha Thomas Opens Up About Body Image and Self Acceptance | Sakshi
Sakshi News home page

Nivetha Thomas: అందంగా ఉన్నా భయపడ్డా.. నివేదా థామస్‌ భావోద్వేగ పోస్ట్‌

Oct 18 2026 3:22 PM | Updated on Oct 18 2026 3:31 PM

Nivetha Thomas Opens Up About Body Image and Self Acceptance

సినిమా తారలు సైతం తమ రూపం(బాడీ) గురించి ఇతరులు ఏమనుకుంటారోనని భయపడుతుంటారు. తాజాగా హీరోయిన్‌ నివేదా థామస్‌ చేసిన ఓ పోస్ట్‌లో ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది మొదట్లోనే దిగిన కొన్ని ఫొటోలను ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో పంచుకోలేకపోయానని ఆమె తెలిపింది. తన ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుందేమో.. ఇతరులు ఏమనుకుంటారోననే ఆలోచనలతో వాటిని తన గ్యాలరీలోనే ఉంచేసినట్లు తెలిపింది.

అందంగా అనిపించినా.. ఆలోచనలతోనే..
‘ఆ రోజు తాను ఎంతో అందంగా కనిపించాను.. ఆ ఫొటోలను చూసిన ప్రతిసారీ అప్పటి జ్ఞాపకాలు, నవ్వులు, ఉదయాన్నే నిద్రలేవడం, కాఫీ కౌంటర్‌ దగ్గరకు వెళ్లడం, సంతోషనంగా గడిపిన క్షణాలు గుర్తుకొచ్చేవి. అయినప్పటికీ నన్ను చూసిన ఇతరులు ఏమంటారో అనే ఆలోచన అప్పటి ఫొటోలను పోస్ట్‌ చేయకుండా అడ్డుకున్నాయి. ఇన్ని నెలలపాటు వాటిని దాచిపెట్టడం బాధగా ఉంది’ అని పేర్కొంది.

‘ప్రస్తుతం ప్రతిదీ కృత్రిమంగానే మారుతోంది. నిజమైన మనిషిలా మన భావోద్వేగాలతో సహా సహజంగా ఉండటమే అందమైన విషయం. మనలో కలిగే ఆలోచనలను పట్టించుకోకుండా ఉండడం కాదని.. వాటి అంగికరిస్తూనే జీవితాన్ని ఆస్వాదించాలి’ అని చెప్పింది. స్వేచ్ఛగా ఉండాలని పోస్ట్‌ ద్వారా సందేశమిచ్చింది.  ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. 

(ఇదీ చదవండి: కమెడియన్‌కు అండగా ఆ హీరో .. ఎన్టీఆర్ సాయం కోరిన రామచంద్ర..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement