ఒక్కోసారి అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఆ కుటుంబం ఎన్నాళ్ల నుంచో కారు కొనుక్కోవాలనుకుంటే..లక్కీ డ్రా రూపంలో బహుమతిగా కారే ఇంటికి వచ్చి సర్‌ప్రైజ్ చేసింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్‌కుకు చెందిన ఆరేళ్ల మేదాన్ష్ రైక్వార్ అనే బాలుడు ఒక గర్భా కార్యక్రమంలో అమ్మమ్మ కొనిచ్చిన రూ. 200 లక్కీ డ్రా కూపన్ ద్వారా ఏకంగా రూ. 50 లక్షలు విలువ చేసే టయోటా ఫార్చ్యూనర్ కారుని గెలుచుకున్నాడు. గత రెండేళ్లుగా ఆ చిన్నారి కుటుంబం కారు కొనాలని చూస్తోంది. ఇంతలో అమ్మమ్మ ఆ చిన్నారి పేరు మీద కొనిచ్చిన లక్కీ డ్రా కూపన్ కారణంగా ఆశ్చర్యకరమైన రీతీలో కల నెరవేరిపోయింది.
అసలు తమ బిడ్డ మేదాన్ష్ కారు గెలుచుకున్నాడా..! అని అతడి కుటంబం మొత్త సంతోషంతో మునిగితేలుతోంది. ఆ చిన్నారి అభపురిలోని 'శ్రీ సర్కార్ ధామ్'లో నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ బహుమతిని గెలుచుకున్నాడు. అతడి అమ్మమ్మ కిరణ్ రైక్వార్ సుమారు ఏడాది క్రితం ఈ కూపన్‌ని కొనుగోలు చేసి, దాన్ని మేదాన్ష్ పేరుతో నమోదు చేసిందామె. ఈ విషయం తెలిసి బంధువులు, స్థానికులు తరలి వచ్చి ఆ చిన్నారి మేదాన్ష్‌కు ఘనస్వాగతం పలికారు.
అంతేగాదు గెలుచుకున్న ఫార్చ్యూనర్ కారుని పెద్దఎత్తున ఊరేగింపుగా తీసుకొచ్చారు. అందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా కేవలం రూ. 200ల పెట్టుబడితో రూ. 50 లక్షలు విలువ చేసే కారు గెలుచుకోవడం మాములు విషయం కాదు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
ఇదీ చదవండి: అరుదైన వ్యాధి, నాల్గో ఏడాదికి మించి బతికే ఛాన్సేలేదన్నారు! కట్‌చేస్తే..


