అరుదైన వ్యాధి, నాల్గో ఏడాదికి మించి బతికే ఛాన్సేలేదన్నారు! కట్‌చేస్తే.. | Archie Thompson: A man with rare condition reaches Everest base camp | Sakshi
Sakshi News home page

అరుదైన వ్యాధి, నాల్గో ఏడాదికి మించి బతికే ఛాన్సేలేదన్నారు! కట్‌చేస్తే..

Oct 28 2026 4:47 PM | Updated on Oct 28 2026 4:53 PM

Archie Thompson:  A man with rare condition reaches Everest base camp

పుట్టినప్పటి నుంచి అరుదైన వ్యాధితో పోరాటం. అనుక్షణం వివిధ ఆరోగ్య సమస్యలతో నరకం. చిరుప్రాయం అంతా చీకటిమయం. ఆఖరికి బతికే అవకాశాలు లేవని తేల్చి చెప్పేశారు వైద్యులు కూడా. అలాంటి ఓ చిన్నారి..బతికి బట్టకట్టడమే కాదు..అందరూ ఆశ్చర్యపోయేలా ఎవరెస్టు బేస్‌ క్యాంపుని అధిరోహించాడు. 

అతడే డెర్బీషైర్‌లోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన ఆర్చీ థాంప్సన్‌. శిశువుగా ఉన్నప్పుడే మోమో సిండ్రోమ్‌ అనే అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు సుమారు 10కి మించి ఉండవట. అయితే ఈ వ్యాధి కారణంగా కళ్లు, తల సహా శరీరా అవయవాలు వేగంగా పెరిగిపోతాయట. అలా ఆర్చీ రెండేళ్ల వయసు రాకముందే రెండు గుండెపోటులను ఎదుర్కొన్నాడు. 

ఆ సమయంలో ఆ చిన్నారికి, అతడి కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి సాయం అందించింది  డెమెల్జా అనే పిల్లల స్వచ్ఛంద సంస్థ. ఈ వ్యాధి అతని గుండె, ఊపిరితిత్తులపై విపరీతమైన ఒత్తిడిని కలిగించేది. అతను నాలుగేళ్ల వయసుకి మించి బతకడని వైద్యులు తేల్చేశారు కూడా. ఆ టైంలోనే ఈ స్వచ్ఛంద సంస్థ ఆ చిన్నారి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి..ఆ వ్యాధిని సవాలు చేసి బతికేలా ప్రోత్సహించింది. అలా అతడు ఆ వ్యాధిని నిర్థారణ అంచనాలను తలకిందులు చేసేలా బతికి బట్టకట్టాడు. 

ఇప్పుడు ఆర్చీకి 24 ఏళ్లు. తనకింత సాయం చేసిన ఆ స్వచ్ఛంద సంస్థకు తన వంతుగా సహాయం చేసే నిమిత్తం ఎవరెస్టు బేస్‌ క్యాంపస్‌ను అధిరోహించాడు. ఆ సంస్థ కోసం నిధుల సేకరణ అందించే దిశగా మొత్తం 23 మంది ఈ ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ యాత్రను చేపట్టారు. ఆ బృందంలో ఆర్చీ కూడా ఒకరు. నేపాల్‌లోని కాఠ్మండుకు విమానంలో చేరుకున్న తర్వాత, ఆ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ బృందం ఎండ, ఎత్తైన ప్రదేశాల ప్రభావాలను తట్టుకుంటూ..సుమారు ఎనిమిదిరోజుల పాటు ట్రెక్కింగ్‌  చేసి దాదాపు 5,364 మీటర్ల (17,598 అడుగుల) ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌కు విజయవంతంగా చేరుకున్నారు. 

నిజానికి అక్కడి వాతావరణం అనుకూలించకపోవడంతోనే పర్వతం నుంచి వారి తిరుగు ప్రయాణం అర్థాంతరంగా ముగిసిపోయింది.  దాంతో వారు తమ విజయాన్ని జరుపుకోవడానికి హెలికాప్టర్‌లో కాఠ్మండుకు తిరిగి వెళ్లారు. ఈ యాత్ర కోసం సుమారు 20 నెలల పాటు శిక్షణ తీసుకున్నాడు. అయితే ఆర్చీ మాత్రం విజయవంతంగా ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరుకోవడంతో ఆ శిక్షణ ఫలించిందని, అక్కడ వీక్షించిన అద్భుతాలను మరువలేనని అంటున్నాడు. ఇక ఆర్చీ ఒక హోటల్‌లో బార్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నిజానికి చిన్నతనమంతా అరుదైన వ్యాధితో పోరాడి..బతకడమే కాకుండా..జీవితానికి ఒక పర్పస్‌ ఉండేలా ఇలాంటి సాహసకృత్యానికి సన్న‍ద్ధ కావడం అనేది ప్రశంనీయమైన విషయం..

ఇదీ చదవండి: కలెక్టర్‌ కాలేకపోయినా..లక్షలాదిమంది జీవితాల్లో వెలుగు నింపింది!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement