ఆ డైరెక్టర్ మాట వల్లే కన్నప్ప వాయిదా వేశా: మంచు విష్ణు | Manchu Vishnu Reveals Kannappa Postponed due His COmments Only | Sakshi
Sakshi News home page

Manchu Vishnu: ఆ భయానికే కన్నప్పను వాయిదా వేశా: మంచు విష్ణు

Jun 29 2025 6:07 PM | Updated on Jun 29 2025 6:28 PM

Manchu Vishnu Reveals Kannappa Postponed due His COmments Only

కన్నప్ప మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్‌ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్‌పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.

మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నా జనరేషన్‌లో నేను నమ్మే డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్‌ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్‌ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్‌ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్‌పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్‌గా మా డైరెక్టర్‌, ఎడిటర్‌, నేను చాలా సీక్వెన్స్‌లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్‌ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం' అని వెల్లడించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement