మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్‌ అప్‌డేట్‌ వచ్చేసింది | Manchu Vishnu Latest Movie Kannappa Prabhas First Look On This Date | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు విష్ణు కన్నప్ప.. రెబల్ స్టార్ ఫస్ట్ లుక్‌ ఎప్పుడంటే?

Jan 27 2025 3:36 PM | Updated on Jan 27 2025 3:36 PM

Manchu Vishnu Latest Movie Kannappa Prabhas First Look On This Date

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్‌కుమార్‌, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ‍ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇ‍చ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

టీజర్‌కు ఊహించని రెస్పాన్స్..

ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement