
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa)కు వరుస కష్టాలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ.. పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. దీనిపై చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.హార్డ్ డిస్క్‌లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కంటెంట్‌ను లీక్ చేస్తే మాత్రం సినిమాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇందులో సినిమాకు కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లన్ని ఈ హార్డ్ డిస్క్‌లోనే ఉన్నాయట. సినిమా బృందం ముందు నుంచి ప్రభాస్ పాత్ర, లుక్ విషయంలో గోప్యత వహించాయి. ఆయన లుక్‌ని మాత్రమే రిలీజ్ చేసి..సినిమాలో ఆయన పాత్రలో ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు.
ఇందులో ప్రభాస్‌తో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇద్దామనే ప్లాన్‌తో ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు హార్డ్‌డ్రైవ్ మిస్ అవ్వడంతో మేకర్స్ భయానికి గురవుతున్నారు. ఒకవేళ ఆ వీడియోని ఆన్‌లైన్‌లో లీక్ చేస్తే.. ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ అన్నీ వైరల్ అయిపోతాయి. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సినిమాలో సగ భాగం వరకు ఈ హార్డ్ డ్రైవ్‌లోనే ఉందట. బ్యాకప్ ఉంటుంది కాబట్టి దొంగిలించిన వాళ్లు అది ఇవ్వకపోయినా నష్టమేమి ఉండదు. కానీ ఆన్‌లైన్‌లో లీక్ చేస్తే మాత్రం ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మరి పోలీసుల చొరవతో ఈ హార్డ్‌డ్రైవ్ మళ్లీ మేకర్స్ చేతికి అందుతుందో లేదో చూడాలి.