
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష‍్ణు ఆసక్తికర కామెంట్స్)
ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
My little munchkins! They are blessed by Lord Shiva to be singing the Stalapurana of SriKalaHasti temple.
Cannot wait for all of you to hear the song. #HarHarMahadev https://t.co/dDPjlxixO1#kannappa— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025