
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ప్రస్తుతం అంతా సైలెంట్ గా ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో కన్నప్ప గురించి మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన సినిమాకు భయపడే విష్ణు 'కన్నప్ప' వాయిదా వేశాడని చెప్పుకొచ్చాడు.
అసలు విషయానికొస్తే.. ఏప్రిల్ 25న వస్తుందనుకున్న కన్నప్ప సినిమాని జూన్ 27కి వాయిదా వేశారు. ఇదే టైంలో మంచు మనోజ్ 'భైరవం' కూడా చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఓటీటీ డీల్ కుదరకపోవడమే, మరేదైనా కారణాలు తెలియదు గానీ రిలీజ్ లేటు చేస్తూ వచ్చారు.
(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)
ఫైనల్ గా ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 30న థియేటర్లలోకి వస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మనోజ్ ఆశపడ్డట్లు ఈసారి అన్న విష్ణు 'కన్నప్ప'తో పోటీ పెట్టుకోలేదు. అదే టైంలో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'కి పోటీగా బరిలో నిలిచారు.
మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మినీ మల్టీస్టారర్ కి విజయ్ కనకమేడల దర్శకుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితీ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్ దీన్ని తెరకెక్కించడం విశేషం.
(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే)
This summer, get ready for a cinematic experience like no other! We are thrilled to announce that #BHAIRAVAM is hitting the big screens worldwide on May 30th! Prepare for an epic journey filled with action, emotion, and the unbreakable spirit of brotherhood. For me, this release… pic.twitter.com/sJ73HPiGIk
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 9, 2025