బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే | Rajinikanth Attend Producer Ishari Ganesh's Daughter Wedding | Sakshi
Sakshi News home page

Ishari Ganesh Daughter: నిర్మాత కుమార్తె పెళ్లికి హాజరైన స్టార్ హీరోలు

May 9 2025 3:22 PM | Updated on May 9 2025 4:42 PM

Rajinikanth Attend Producer Ishari Ganesh's Daughter Wedding

తమిళ ప్రముఖ నిర్మాత ఇషారీ గణేష్ తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. చెన్నైలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ శుభకార్యానికి తమిళ ఇండస్ట్రీ మొత్తం దాదాపు హాజరైంది. రజనీకాంత్ దగ్గర నుంచి మొదలు పెడితే చిన్న హీరోల వరకు వచ్చి నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.

(ఇదీ చదవండి: ‘#సింగిల్‌’ మూవీ రివ్యూ)

వెల్స్ యూనివర్సిటీ ఛైర్మన్ గా అందరికీ తెలిసిన ఇషారీ గణేశ్.. 2016 నుంచి సినిమా నిర్మాతగా మారారు. చిన్నాపెద్దా హీరోలతో మూవీస్ చేశారు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలు నిర్మిస్తున్నారు. ఇకపోతే తన పెద్ద కూతురు ప్రీతా గణేశ్ ని లస్విన్ కుమార్ అనే కుర్రాడికి ఇచ్చి వివాహం చేశారు.

గురవారం రాత్రి సంగీత్ జరగ్గా.. హీరో సూర్య హాజరయ్యారు. శుక్రవారం జరిగిన  పెళ్లికి మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్, మణిరత్నం-సుహాసిని, ప్రభు, అధిక్ రవిచంద్రన్, దర్శకుడు వాసు, గౌతమ్ మేనన్, హీరో జీవా, జయం రవి, సత్యరాజ్, సుందర్ సి, ఖుష్బూ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement