
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే సరికొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆయన హీరోగా నటించిన 3బీహెచ్‌కే జూలై 4న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి శ్రీగణేశ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు హీరో సిద్ధార్థ్, హీరోయిన్ మీతా రఘునాథ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కేవలం రెండు వేల రూపాయలకే అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యానని వెల్లడించారు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ..' నేను నా లైఫ్‌ను రెండుసార్లు రీసెట్ చేశాను. ఎంబీఏ పూర్తి చేసి కార్పొరేట్ జాబ్ చేయకుండా సినిమా వైపు వచ్చా. కేవలం రెండు వేల రూపాయలకే మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. అప్పుడు నా పేరేంట్స్ నన్ను చూసి ఆందోళనకు గురయ్యారు. వీడేంటి సినిమా సైడ్ వెళ్తున్నాడు.. అది కూడా డైరెక్టర్ అవుతానని అంటున్నాడు. వీడు ఏమవుతాడో అని భయపడ్డారు. అక్కడి నుంచి మొదలై 25 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక సింగర్‌గా, నటుడిగా మీ ముందు నిలబడ్డా' అని పంచుకున్నారు.
(ఇది చదవండి: తెలుగులో అద్భుతంగా మాట్లాడిన హీరోయిన్.. నోరెళ్లబెట్టిన హీరో సిద్దార్థ్)
కాగా.. 3 బీహెచ్‌కే మూవీలో శరత్‌కుమార్, దేవయాని, చైత్ర, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 4న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముదుకొచ్చింది. కాగా.. గతేడాది సిద్ధార్థ్ వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఆదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. తెలంగాణలోని ఓ ప్రాచీన ఆలయంలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.