'కన్నప్ప' ట్రైలర్ అప్‌డేట్.. కాస్త త్వరగానే | Kannappa Trailer Details Latest | Sakshi
Sakshi News home page

Kannappa Trailer: మంచు విష్ణు 'కన్నప్ప' ట్రైలర్ ఎప్పుడంటే?

Jun 10 2025 4:34 PM | Updated on Jun 10 2025 4:44 PM

Kannappa Trailer Details Latest

రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్‌డేట్ కూడా ఇచ్చేశారు.

'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత  బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)

ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్‌కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?

మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్‌కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
Advertisement