కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం! | Sanyasi Comment Goes Viral in Kannappa Special Premiere at Vijayawada | Sakshi
Sakshi News home page

ఆ రెండు సాంగ్స్‌ లేకుంటే కన్నప్ప మళ్లీ చూసేవాళ్లం.. అది మా సన్యాసి బుద్ధి

Jul 11 2025 6:32 PM | Updated on Jul 11 2025 7:29 PM

Sanyasi Comment Goes Viral in Kannappa Special Premiere at Vijayawada

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కన్నప్ప సినిమా (Kannappa Movie) ప్రకటించినప్పుడు చాలా ట్రోల్స్‌ వచ్చాయి. టీజర్‌ విడుదలైనప్పుడు వచ్చిన విమర్శలకైతే లెక్కే లేదు. కానీ ఆ వెంటనే రిలీజ్‌ చేసిన పాటతో ట్రోలింగ్‌ అంతా మట్టికొట్టుకుపోయింది. ట్రైలర్‌ కూడా బాగుండటంతో నెగెటివిటీ కాస్తా పాజిటివిటీగా మారిపోయింది. జూన్‌ 27న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

సాధువులతో సినిమా చూసిన మోహన్‌బాబు
కన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటించగా అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, మధుబాల కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే గజల్ గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కన్నప్ప సినిమాను జూలై 8న విజయవాడలో ప్రదర్శించారు. అఘోరాలు, సాధువులు, నాగసాధువులు, పీఠాధిపతులతో కలిసి మోహన్‌బాబు సినిమా చూశారు.

కొంచెం మసాలా పెట్టినప్పటికీ..
అనంతరం స్వామీ సదానందగిరి మాట్లాడుతూ.. ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడో లవకుశ, శంకరాభరణం చూశాం. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత ఒక నిజమైన కథ చూశాం. భక్త కన్నప్ప, అర్జునుడి గురించి మాకు తెలుసు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారు. ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా పెట్టినప్పటికీ.. నిజమైన భక్తిని దర్శకుడు, రచయిత అద్భుతంగా చూపించారు.

ఆ పాటల వల్లే..
సన్యాసులమైన మాకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించింది. ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లం. అది మా సన్యాసి బుద్ధి. అయితే ఆ పాటల్లోనూ ఎటువంటి అసభ్యత లేదు. ఆ కాలపు నాగరికత ఆధారంగానే తీశారు అని పేర్కొన్నారు. ఆ కామెంట్లు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

చదవండి: ఆ హీరో నా కొడుకే.. తనతో గొడవపడ్తూ ఉంటా: సవతి తల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement