
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) చిన్నవయసులోనే అతడి తల్లిదండ్రులు నీలిమ అజీమ్- పంకజ్ కపూర్ విడిపోయారు. తర్వాత పంకజ్.. నటి సుప్రియ పాఠక్‌ను 1988లో రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు రుహాన్, కూతురు సనా సంతానం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్‌తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది సుప్రియ పాఠక్ (Supriya Pathak). ఆమె మాట్లాడుతూ.. అతడు నా కొడుకు. తల్లీకొడుకుల మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో మా మధ్య కూడా అదే ఆత్మీయత ఉంటుంది.

నటి సుప్రియ పాఠక్ ఫ్యామిలీతో షాహిద్
షాహిద్ నా కొడుకే..
షాహిద్‌కు ఆరేళ్లున్నప్పుడు అతడిని కలిశాను. కన్నతల్లిని కాకపోయినా అతడు నా కొడుకే అనిపిస్తుంది. రుహాన్, సనాతో పాటు షాహిద్ కూడా నా పిల్లలే అని భావిస్తాను. ఈ ముగ్గురితోనూ ప్రేమగా ఉంటాను, పోట్లాడతాను, ఫ్రెండ్‌లా ఉంటాను అని చెప్పుకొచ్చింది. షాహిద్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇష్క్ విష్క్ చిత్రంతో హీరోగా మారాడు.
సినిమా
36 చైనా టౌన్, చుప్‌చుప్‌కే, జబ్ వి మెట్, ఆర్.. రాజ్‌కుమార్, హైదర్, ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి చిత్రాలతో అలరించాడు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్‌లో యాక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఫర్జి వెబ్ సిరీస్‌లోనూ మెప్పించాడు. తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా చిత్రంతో మరోసారి హిట్టందుకున్నాడు. చివరగా షాహిద్ నటించిన దేవా మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.