'మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు'.. బ్రహ్మనందం కామెంట్స్ వైరల్! | Brahmanandam comments about Mohan babu in Pre Release Event | Sakshi
Sakshi News home page

Brahmanandam: ' ఆ సినిమాకు ఫస్ట్‌ నన్నే అడిగారు'.. సుమ ప్రశ్నకు బ్రహ్మనందం సమాధానం!

Jun 21 2025 9:41 PM | Updated on Jun 21 2025 9:51 PM

Brahmanandam comments about  Mohan babu in Pre Release Event

మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్‌తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

బ్రహ్మనందంను యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు ఈవెంట్‌లో నవ్వులు పూయించారు. ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాల్లో మిమ్మ‍ల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఏ సినిమాను ఎంచుకుంటారు? అని ప్రశ్నించింది. అందులో మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి అల్లుడుగారు, రెండోది పెదరాయుడు, మూడో ఆప్షన్‌గా అసెంబ్లీ రౌడీగా చెప్పింది.

దీనికి బ్రహ్మనందం అసెంబ్లీ రౌడీ సినిమాను ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో మొదట నన్నే అడిగారని అన్నారు. అయితే తాను రిజెక్ట్‌ చేశానని తెలిపారు. ఆ తర్వాత మోహన్‌ బాబు మా ఇంటికి ప్రాధేయపడితే ఏ చేస్తాం సుమ? అని సర్లే చేసుకోపో అని చెప్పానంటూ నవ్వులు పూయించారు. అయితే యమదొంగలో కూడా మిమ్మల్నే అడిగారంటా అని సుమ మరో ప్రశ్న వేసింది. యమదొంగలో మాత్రం నన్ను అడగలేదు.. అలాంటి పాత్రలకు ఆయనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడు.. బయట సరిపోతాడు.. అలాగే స్క్రీన్ మీద కూడా ఆయనే సెట్‌ అవుతాడంటూ అందరినీ నవ్వించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అంతేకాకుండా మోహన్‌ బాబులో మీకు నచ్చేది? నచ్చనిది ఏది? అంటూ సుమ అడిగింది. దీనికి మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చడంటూ సరదాగా మాట్లాడారు. ఓ మహ నటుడిని ఎవరు ఇష్టపడరమ్మా? అంటూ నవ్వుతూ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement