
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
సూర్య, దీపికతో..
ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.
చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి