
సినిమా అవకాశాల కోసం వెళ్తే చేదు అనుభవాలు ఎదుర్కొన్న నటీనటులు ఎందరో! అయితే సినిమాలే కాదని ఓటీటీలో ఛాన్సులు కావాలంటే కూడా పిచ్చి కండీషన్లు పెడుతున్నారని చెప్తున్నారు నటి హెల్లీ షా (Helly Shah). తనకు ఓ వెబ్ సిరీస్‌లో ఆఫర్ వచ్చిందట.. కానీ వాళ్లు చెప్పిన కండీషన్‌కు ఓకే అంటేనే ఎంపిక చేస్తామని మెలిక పెట్టారట! ఈ విషయం గురించి హెల్లీ షా మాట్లాడుతూ.. గతంలో నాకు పెద్ద వెబ్ సిరీస్‌లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదిస్తూ ఓ మెసేజ్ వచ్చింది.

కండీషన్‌కు ఒప్పుకుంటే..
అది చూడగానే.. నేను మీ ప్రాజెక్టులో భాగం కావాలనుకుంటున్నారా? అని కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అందుకు అవతలివైపు నుంచి అవును, అందుకోసమే మీకు మెసేజ్ చేశాం అని రిప్లై వచ్చింది. నేను చాలా సంతోషించాను. కానీ అంతలోనే.. ఓ కండీషన్.. మేము చెప్పిన ప్రదేశానికి వచ్చి చెప్పినట్లు చేయాలి. అందుకు ఓకే అంటే ఈ ప్రాజెక్ట్ మీ మీ సొంతం అన్నారు. నా వల్ల కాదు, మీరు వేరే ఎవర్నైనా చూసుకోండి అని రిప్లై ఇచ్చాను.

ఆన్‌లైన్‌లో అయినా ఓకే
అప్పటికీ అవతలి వ్యక్తి ఊరుకోలేదు. పర్లేదు, మీరు రాకపోయినా సరే, ఫోన్‌లోనే నేను చెప్పింది చేయండి. ఆన్‌లైన్‌లో అయినా నాకేం పర్లేదని బదులిచ్చాడు. అతడు అన్న మాటల్ని నా నోటితో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. ఆన్‌లైన్‌లో కాంప్రమైజ్ అడిగాడు. ఈ సోదంతా నాకెందుకు అని అతడి నెంబర్ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాను. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సిగ్గులేని జనాలు మారరు. కొంచెమైనా పద్ధతిగా ప్రవర్తించరు. ఇలాంటి మనుషులతో నాకెందుకు అని ఆ వెబ్ సిరీస్‌ను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చారు.
సీరియల్స్- సినిమా
హెల్లీ షా ప్రస్తుతం గుజరాతీ మూవీ దేడ చేస్తున్నారు. ఇందులో హెల్లీ గర్భవతిగా కనిపించనున్నారు. ఈ మూవీ జూలై 4న విడుదలవుతోంది. ఇకపోతే హెల్లీ షా.. అలక్ష్మి: హమారీ సూపర్ బహు, ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి, దేవాన్షి, స్వరాగిని- జోడైన్ రిష్తో కే సుర్, ఇష్క్ మే మర్జవాన్ 2: నయా సఫర్ వంటి పలు సీరియల్స్ చేశారు. గుల్లక్, పిరమిడ్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ మెరిశారు.
చదవండి: ఓటీటీలోకి సడన్‌గా వచ్చేసిన భారీ బడ్జెట్ మూవీ.. ఎక్కడంటే?