
కొన్ని సినిమాలు థియేటర్లలో మ్యాజిక్ చేద్దామనుకుంటాయి. తీరా కనీస ఆదరణ కూడా దక్కక బొక్కబోర్లా పడతాయి. థగ్ లైఫ్ సినిమా అలాంటి కోవకు చెందినదే! మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీలో కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా, శింబు, త్రిష, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఓటీటీలో థగ్‌లైఫ్
ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో రూ.90 కోట్లే ఇస్తామని పేచీ పెట్టింది. చివరకు చర్చల అనంతరం రూ.110 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు భోగట్టా. అంతేకాదు సినిమా రిలీజయ్యాక 8 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేస్తామన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. దాంతో నాలుగు వారాల్లోనే థగ్ లైఫ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా నేడ (జూలై 3) సడన్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో దర్శనమిచ్చింది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

వివాదాలు
థగ్ లైఫ్ రిలీజ్‌కు ముందు భారీ అంచనాలున్నాయి. ఎప్పుడైతే కర్ణాటకలో సినిమా ప్రమోషన్స్‌లో కమల్ హాసన్ నోరు జారారో అప్పటినుంచే కష్టాలు మొదలయ్యాయి. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో థగ్‌లైఫ్ కన్నడలో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఈ వ్యవహారం కోర్టుదాకా వెళ్లగా.. కర్ణాటకలో సినిమా రిలీజ్ చేసేందుకు అనుమతి తెచ్చుకున్నారు.
కానీ అప్పటికే థగ్‌లైఫ్ మిగతా చోట్ల రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. థగ్ లైఫ్ సినిమా రిలీజైన 8 వారాల తర్వాతే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ దాన్ని రద్దు చేయడం వల్ల మల్టీప్లెక్స్ థియేటర్లు.. థగ్‌లైఫ్ నిర్మాత కమల్ హాసన్‌పై రూ.25 లక్షల జరిమానా వేసినట్లు తెలుస్తోంది.
Streaming now on NETFLIX #ThugLife pic.twitter.com/u3BxaX2Dfm
— Christopher Kanagaraj (@Chrissuccess) July 2, 2025