ఇండియా మొత్తం వెతికితే అనంతిక దొరికింది: నిర్మాత రవిశంకర్‌ | Producer Ravi Shankar Interesting Comments On Ananthika Sanilkumar At 8 Vasanthalu Pre Release Event | Sakshi
Sakshi News home page

ఇండియా మొత్తం వెతికితే అనంతిక దొరికింది: నిర్మాత రవిశంకర్‌

Jun 19 2025 11:38 AM | Updated on Jun 19 2025 12:38 PM

Producer Ravi Shankar Interesting Comments On Ananthika Sanilkumar At 8 Vasanthalu Pre Release Event

‘‘క్లాసికల్‌ డ్యాన్స్, మార్సల్‌ ఆర్ట్స్‌ రెండూ వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది... తనే అనంతిక. ‘8 వసంతాలు’ సినిమా కోసం తను చాలా కష్టపడింది’’ అని నిర్మాత వై. రవిశంకర్‌ తెలిపారు. అనంతికా సనీల్‌కుమార్‌ లీడ్‌ రోల్‌లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. 

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవిశంకర్‌ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల ప్రయాణమే ‘8 వసంతాలు’. ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్‌ పిల్లర్స్‌. విజువల్‌గా అదిరిపోయింది. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం’’ అన్నారు. 

నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ– ‘‘చాలా వైవిధ్యమైన చిత్రమిది. ఈ సినిమా కోసం పని చేసిన కొత్తవాళ్లందరి కోసమైనా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అని తెలిపారు. ‘‘నవీన్‌గారు, రవిగారు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాదు... మంచి సినిమానా? కాదా? అనేది చూస్తారు. మా ‘8 వసంతాలు’ మంచి చిత్రం’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘శుద్ధి అయోధ్య లాంటి బలమైన పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అనంతిక చె΄్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement