8 వసంతాల హీరోయిన్.. 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ఏంది బ్రో! | Tollywood actress Ananthika Sanilkumar Multi Skill Goes Viral | Sakshi
Sakshi News home page

Ananthika Sanilkumar: 8 వసంతాల హీరోయిన్.. 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ఏంది బ్రో!

Jun 18 2025 3:46 PM | Updated on Jun 18 2025 4:19 PM

Tollywood actress Ananthika Sanilkumar Multi Skill Goes Viral

అనంతిక సనీల్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం  '8 వసంతాలు'. ఇప్పటికే షూటింగ్ ‍పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్‌  అనంతిక టాలెంట్‌ను నెటిజన్స్ షాకవుతున్నారు. కేవలం 19 ఏళ్లకే ఇంత ప్రతిభ ఎలా సాధించారంటూ చర్చించుకుంటున్నారు. అనంతిక కేవలం నటన మాత్రమే కాదు.. ఆమెలో మల్టీ టాలెంటెడ్‌ అని వేదికపైనే నిరూపించుకుంది. అనంతిక  క్లాసికల్ డ్యాన్సర్‌తో పాటు కరాటేలో బ్లాక్‌ బెల్ట్, కలరిపయట్టు విద్యలో నైపుణ్యం, కత్తిసాము, చెండా వాయించడం(పెర్కషన్) లాంటి విద్యల్లో నైపుణ్యాలు సాధించింది. అంటే ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా ఇన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయా? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా ఈవెంట్‌లో అనంతికి చేసిన స్టంట్స్ చూస్తే ఆమె టాలెంట్‌ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.

ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు కాగా.. తన టాలెంట్‌లో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేరళకు చెందిన అనంతిక లా విద్యార్థిని కూడా. కాగా.. ఈ చిత్రంలో అనంతిక సనీల్‌కుమార్‌తో పాటు రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ లేడీ ఓరియంటెడ్‌ మూవీ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement