కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే | Kuberaa And 8 Vasanthalu OTT Details | Sakshi
Sakshi News home page

Kuberaa OTT: 'కుబేర' ఆ ఓటీటీలో.. '8 వసంతాలు' ఇందులో

Jun 20 2025 4:58 PM | Updated on Jun 20 2025 5:48 PM

Kuberaa And 8 Vasanthalu OTT Details

ఈ వారం ఓటీటీల్లో దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు థియేటర్లలోనూ మూడు కొత్త మూవీస్ వచ్చేశాయి. వీటిలో 'కుబేర'కి పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. నాగార్జున, రష్మిక కూడా ఆకట్టుకున్నారని రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేవాళ్లు చూస్తారు. అలానే ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు.

'కుబేర' ఓటీటీ డీల్ విషయానికొస్తే.. రిలీజ్‌కి ముందు డిజిటల్ హక్కులు అమ్మేశారు. లెక్క ప్రకారం నిర్మాతలు.. జూలైలో వద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ చేయాలని చెప్పాడు. దీంతో నిర్మాతలు తలొగ్గారు. అయితే ఓటీటీ ఒప్పందం మాత్రం నాలుగు వారాలకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూలై 3వ వారంలో అలా స్ట్రీమింగ్ కావొచ్చేమో?

(ఇదీ చదవండి: Kuberaa Review: ‘​కుబేర’ మూవీ రివ్యూ)

'8 వసంతాలు' విషయానికొస్తే.. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం. బాగుందనే టాక్ వస్తుంది. అదే టైంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగేలా ఉందని అంటున్నారు. హీరోయిన్‌గా అనంతిక యాక్టింగ్ ఇచ్చిపడేసిందని రివ్యూలు వచ్చాయి. కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో సినిమాలన్నీ నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.

ఈ రెండింటితో పాటు హిందీ సినిమా ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా థియేటర్లలో రిలీజైంది.  దీని బుకింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి.  పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఎంతమేర నిలబడుతుందో చూడాలి? ఎందుకంటే ఆమిర్ గత చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అలానే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్.

(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement