ఆగస్టులో ఆట మొదలు | Dulquer Salmaan first look poster for I Am Game was released | Sakshi
Sakshi News home page

ఆగస్టులో ఆట మొదలు

May 8 2026 3:33 AM | Updated on May 8 2026 3:33 AM

Dulquer Salmaan first look poster for I Am Game was released

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్‌ గేమ్‌’. నహాస్‌ హిదాయత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆంటోని వర్గీస్, మైస్కిన్, కయాదు లోహర్, కతిర్, పార్థ్‌ తివారి, సంయుక్త విశ్వనాథన్‌ కీలక పాత్రల్లో నటించారు. వే ఫారర్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై దుల్కర్‌ సల్మాన్, జోమ్‌ వర్గీస్‌ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ దశలో ఉంది.

కాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించి, దుల్కర్‌ సల్మాన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘‘నా కెరీర్‌లో చేసిన సినిమాల్లో ‘ఐ యామ్‌ గేమ్‌’ అత్యంత స్టైలిష్‌ ఫిల్మ్‌. నహాస్‌ హిదాయత్‌ ప్రత్యేకంగా నన్ను ఓ కొత్త స్టైలిష్‌ లుక్‌లో చూపించడం ఈ ప్రాజెక్ట్‌కు హైలెట్‌.  ‘లోకా’ వంటి మెగా బ్లాక్‌బస్టర్‌ తర్వాత వే ఫారర్‌ ఫిలిమ్స్‌ నుంచి వస్తున్న చిత్రం ‘ఐ యామ్‌ గేమ్‌’. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది’’ అని దుల్కర్‌ సల్మాన్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement