వీకే నరేశ్, అనుపమా పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వంలో బూసం జగన్‌మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పర్వతాలు అనే కీలక పాత్ర చేస్తున్నారు వీకే నరేశ్.
మంగళవారం (జనవరి 20) వీకే నరేశ్ బర్త్ డే సందర్భంగా ఈ పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘తెలంగాణ నేపథ్యంలో పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి.


