మళ్లీ కెమెరా ముందుకు విజయ్‌ | Cm Vijay Re Entry As Actor Tamilnadu govt Ads | Sakshi
Sakshi News home page

Cm Vijay: మళ్లీ కెమెరా ముందుకు విజయ్‌

Nov 8 2026 8:44 AM | Updated on Nov 8 2026 8:44 AM

Cm Vijay Re Entry As Actor Tamilnadu govt Ads

హీరోగా దక్షిణాది ప్రేక్షకులను అలరించిన విజయ్‌.. 69 సినిమాలు చేశారు. దళపతిగా మంచి గుర్తింపు సాధించారు. అలా ప్రజాసేవలోకి వచ్చి తమిళ్‌ వెంట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు.  ఏడాదిలోనే ముఖ్యమంత్రి కూడా అయిపోయారు. ఈయన హీరోగా చేసిన మూవీ జననాయగన్‌. ఇదే తన చివరి చిత్రమని ప్రకటించి అభిమానులకు షాక్‌ ఇచ్చారు. విజయ్ మళ్లీ నటిస్తే బాగుంటుందని భావిస్తున్న ఫ్యాన్స్‌కి ఇప్పుడో ఓ గుడ్ న్యూస్.

(ఇదీ చదవండి: హీరో నిఖిల్ ఏమయ్యాడు? 'స్వయంభు' రిలీజ్ ఎప్పుడు?)

ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ప్రభుత్వ పథకాలు, సేవా కార్యక్రమాల గురించి అవగాహన కోసం తీసే ఓ యాడ్‌లో విజయ్ నటించనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చాలా మందికి తెలియడం లేదని, ముఖ్యంగా బడుగు వర్గాల వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కలగడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌నే స్వయంగా ఈ ప్రచార చిత్రంలో నటిస్తే జనానికి బాగా అవగాహన కలుగుతుందని భావించిన ప్రభుత్వం దీన్ని రూపొందించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రచార చిత్రానికి గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించనున్నారని.. ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ రెండు రోజులు కాల్‌ షీట్స్‌ కేటాయించినట్లు త్వరలోనే చైన్నె పరిసర ప్రాంతాలలో షూటింగ్‌ నిర్వహించనున్నట్లు సమాచారం. 

(ఇదీ చదవండి: 'టాలీవుడ్'కి క్లాస్ పీకుతున్న ప్రేక్షకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement