హీరో నిఖిల్ ఏమయ్యాడు? 'స్వయంభు' రిలీజ్ ఎప్పుడు? | Swayambhu Movie Latest Update And Release Date Details | Sakshi
Sakshi News home page

Swayambhu Movie: 2026లోనూ నో రిలీజ్.. మరి ఇంకెప్పుడు?

Nov 7 2026 3:45 PM | Updated on Nov 7 2026 3:49 PM

Swayambhu Movie Latest Update And Release Date Details

తెలుగులో చాలామంది హీరోలున్నారు. వీళ్లలో స్టార్ హీరోలని పక్కనబెడితే కొందరు మిడ్ రేంజ్ హీరోలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణే ఉంది. కానీ అందుకు తగ్గట్లు వాళ్లు సినిమాలు తీయట్లేదు. తీసినా సరే అవి థియేటర్లలో రిలీజ్ కావట్లేదు. అలాంటి ఓ చిత్రమే 'స్వయంభు'. నిఖిల్ హీరో. ఇంతకీ ఈ మూవీ ఏమైంది? రిలీజ్ చేస్తారా చేయరా?

(ఇదీ చదవండి: సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)

స్వామి రారా, కార్తికేయ, ఎక్కడిపోతావు చిన్నవాడ సినిమాలతో హిట్స్ కొట్టిన నిఖిల్.. 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 'స్వయంభు' అనే పాన్ ఇండియా సినిమాని మూడునాలుగేళ్ల క్రితం ప్రకటించాడు. 2023 ఆగస్టులోనే దీని షూటింగ్ మొదలైంది. ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయాయి గానీ సదరు చిత్రం రిలీజ్ జాడలేకుండా పోయింది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో తెలియని పరిస్థితి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో శివరాత్రికే 'స్వయంభు' రిలీజ్ చేసేస్తామని ప్రమోషన్లతో టీమ్ హడావుడి చేశారు. టీవీ షోల్లో పాల్గొని, పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ వాయిదా పడింది. వేసవికి వచ్చేస్తామని అన్నారు కానీ అదీ జరగలేదు. తర్వాత నుంచి టీమ్ సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు నవంబరు నెల. మరో 50 రోజుల్లో 2026 పూర్తవుతుంది. ప్రాక్టికల్‌గా చూస్తే ఈ ఏడాదిలో రిలీజ్ అసాధ్యం. పోనీ వచ్చే ఏడాది వద్దామనుకుంటే సంక్రాంతి సీజన్ ఇప్పటికే ఫుల్ అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి, ఆపై వేసవి బెర్తులు నిండిపోతున్నాయి. మరి 'స్వయంభు' ఎప్పుడొస్తుందో ఏంటో?

'కార్తికేయ 2' హిట్ కాకముందు వరకు నిఖిల్ చేసిన సినిమాలు తెలుగులోనే రిలీజ్ అయ్యేవి. ఎప్పుడైతే ఈ పాన్ ఇండియా గోలలో పడ్డాడో అప్పటినుంచి రెగ్యులర్‌గా కనిపించకుండాపోయాడు. సాధారణ ప్రేక్షకులు చాలామంది ఇతడిని మర్చిపోయారు! 'స్వయంభు' కాకుండా రామ్ చరణ్ నిర్మాతగా 'ద ఇండియన్ హౌస్' అని ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అది ఉందో లేదో? 'స్వయంభు' రిలీజ్‌తో పాటు తన సినిమాలపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నిఖిల్‌కి ఎంతైనా ఉంది!

(ఇదీ చదవండి: సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉంది.. టాలీవుడ్ నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement