'45 రోజుల కఠిన శిక్షణ'.. నిఖిల్ స్వయంభూ వీడియో చూశారా? | Nikhil Siddhartha Birthday Special Swayambhu Team released specil video | Sakshi
Sakshi News home page

Swayambhu Movie: 'స్వయంభూ కోసం నిఖిల్ ఇంత కష్టపడ్డారా?'.. బర్త్‌ డే స్పెషల్ వీడియో

Jun 1 2026 9:21 PM | Updated on Jun 1 2026 9:21 PM

Nikhil Siddhartha Birthday Special Swayambhu Team released specil video

నిఖిల్‌ హీరోగా వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ . ఈ మూవీకి భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో సంయుక్త మీనన్, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీ రిలీజ్‌ తేదీని ఇంకా ప్రకటించలేదు.

అయితే ఇవాళ నిఖిల్ బర్త్‌ డే కావడంతో మేకర్స్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ మూవీలో యోధుడిగా కనిపించేందుకు నిఖిల్ ఎంతలా కష్టపడ్డారో చూపించే వీడియోను రిలీజ్ చేశారు. యోధుడిలా మారేందుకు 45 రోజులు చాలా కఠినమైన శిక్షణ.. వియత్నాం పోరాట రోజులను పుట్టినరోజు కానుకగా చూపించినందుకు టీమ్ స్వయంభూకి ధన్యవాదాలు.. కష్టపడకుండా ఫలితం రాదు.. అంటూ నిఖిల్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. త్వరలోనే స్వయంభూ థియేటర్లలోకి వస్తుందంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌ వీడియోను మీరు కూడా చూసేయండి. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement