'ఆ దారుణాన్ని మర్చిపోలేదు.. ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పారు..' హీరో నిఖిల్ | Tollywood Hero Nikhil Siddharth Tweet On West Bengal Eletions | Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: 'అందుకే తగిన బుద్ధి చెప్పారు..'వెస్ట్ బెంగాల్ ఫలితంపై నిఖిల్ పోస్ట్

May 4 2026 9:24 PM | Updated on May 4 2026 9:30 PM

Tollywood Hero Nikhil Siddharth Tweet On West Bengal Eletions

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయంపై టాలీవుడ్ హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ దారుణాలను ప్రజలు ఇంకా మరిచిలేదు.. క్షమించనూ లేదన్నారు. అందుకే మమతా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని రాసుకొచ్చారు. సామాన్యుడిని పట్టించుకోని ప్రభుత్వానికి ఇలాంటి గతే పడుతుందన్నారు. ఆర్జీ కర్ వైద్య కళాశాల బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు. గతంలో ఈ దారుణంపై తాను మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేశారు.

కాగా.. ఇవాళ వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికారంలో ఉన్న టీఎంసీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆమె ప్రభుత్వంలోనే ఆర్జీకర్ వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంగతి  తెలిసిందే. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement