స్వయంభు ప్రపంచంలో... | New Video Released from Swayambhu Movie: 750 Artists and 2700 VFX Shots | Sakshi
Sakshi News home page

స్వయంభు ప్రపంచంలో...

May 24 2026 12:37 AM | Updated on May 24 2026 12:37 AM

New Video Released from Swayambhu Movie: 750 Artists and 2700 VFX Shots

నిఖిల్‌ సిద్ధార్థ హీరోగా నటించిన చిత్రం ‘స్వయంభు’. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించారు. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ నిర్మించారు. ఈ చిత్రంపోస్ట్‌ ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించి, ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో సినిమాపోస్ట్‌ ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ పనుల విస్తృత స్థాయిని చూపించారు.

నిఖిల్‌ సిద్ధార్థ, భరత్‌ కృష్ణమాచారి, సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్‌ కుమార్‌ కలిసి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ ఫాంథమ్‌ ఎఫ్‌ఎక్స్‌ను సందర్శించడం కనిపించింది. ‘‘భారీ పీరియాడిక్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘స్వయంభు’. ఈ చిత్రానికి 2700కి పైగా వీఎఫ్‌ఎక్స్‌ షాట్లు, 750 మందికిపైగా టెక్నీషియన్లు పని చేస్తున్నారు. భారీ యుద్ధ సన్నివేశాలు, విశాలమైన ప్రా చీన రాజ్యాలు, అద్భుతమైన విజువల్‌ ప్రపంచాన్ని రూపొందిస్తున్నాం. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement