పేరున్న హీరోలే.. బడ్జెట్ ఎక్కువే.. కానీ ఏం లాభం? | Vishwambhara And Swayambhu Movie Release Date Confusion | Sakshi
Sakshi News home page

Tollywood: రిలీజ్ ఎప్పుడో తెలీదు.. తగ్గిపోతున్న బజ్

May 29 2026 3:49 PM | Updated on May 29 2026 3:51 PM

Vishwambhara And Swayambhu Movie Release Date Confusion

సినిమా చూడటం సులభమే కానీ తీయడం చాలా కష్టం. 24 విభాగాలు పక్కాగా పనిచేస్తే తప్పితే మూవీ థియేటర్లో రిలీజ్ కాదు. అయితే ఒకప్పుడు స్టార్ హీరోలు కూడా ఏడాది ఒకటి రెండు చిత్రాలతో ప్రేక్షకులని పలకరించేవారు. దీంతో సదరు హీరోలంటే ఆడియెన్స్‌కి కూడా ఓ గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా తయారైంది. పేరున్న హీరోల మూవీస్ కూడా ఎప్పుడు రిలీజవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ అలాంటివి ఏంటి?

(ఇదీ చదవండి: స్టైల్ మార్చిన సీఎం విజయ్.. నిర్మాత ఇంటి వేడుకలో)

ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు చిరంజీవి. 'విశ్వంభర' అనే సినిమా ఈయన 2023లో ప్రకటించారు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రూ.400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్. ఏడు లోకాలు. ఇలా చాలానే ప్లస్సులు ఉన్నాయి. కానీ ఇప్పటికే రిలీజ్ డేట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. రేపో మాపో వచ్చేస్తుందని సోషల్ మీడియాలో రూమర్స్ తప్పితే అసలు సంగతి ఏంటనేది హీరో, దర్శకుడికి తప్పితే మరెవరికీ తెలియదమో?

యంగ్ హీరో నిఖిల్ చేసిన పాన్ ఇండియా సినిమా 'స్వయంభు'. బాహుబలి తరహా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం కూడా చాన్నాళ్లుగా సెట్స్‌పై ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి హీరోహీరోయిన్లు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. వేసవిలో రిలీజ్ చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు గడిచిపోయాయి గానీ దీని రిలీజ్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు.

(ఇదీ చదవండి: 3 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

మెగాహీరో సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు' కూడా ఇలానే తయారైంది. ఈ ప్రాజెక్టు కూడా అప్పుడెప్పుడో మొదలైంది. షూటింగ్ ఆగుతూ ఆగుతూ జరుగుతోంది. బడ్జెట్ సమస్యల కారణంగానే ఇన్నేళ్లుగా సెట్స్‌పై ఉందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. పై రెండింటి ఔట్‌పుట్ రెడీ అయిపోయింది గానీ దీనిది ఇంకా చాలా పెండింగ్‌లో ఉంది. అది పూర్తి చేసి ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి.

పైన చెప్పిన సినిమాల్లో పేరున్న హీరోలే నటించారు. బడ్జెట్ కూడా వందల కోట్ల రూపాయలు పెట్టారు. కానీ సరైన ప్లానింగ్ లేకపోవడం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో ఏళ్లకు ఏళ్లు గడిచిపోతూనే ఉన్నాయి కానీ రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావట్లేదు. సినిమాలు ఇలా ల్యాబ్‌ల్లో మగ్గిపోవడం వల్ల నిర్మాతకు వడ్డీ భారం పెరిగిపోతుంది. ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై బజ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే. మరి ఈ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏంటో?

(ఇదీ చదవండి: అమ్మకు క్యాన్సర్ వస్తే జ్వరం అనుకున్నా.. నాన్న బుర్ర చెడిపోయింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement