హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సీఎంలు అందరూ తెల్లని దుస్తుల్లో కనిపిస్తూ వచ్చారు. విజయ్ మాత్రం ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి బ్లాక్ కలర్ సూట్‌లోనే కనిపిస్తున్నారు. అంతలా అలానే దర్శనమిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం స్టైల్ మార్చి పట్టుపంచెలో దర్శనమిచ్చారు.
(ఇదీ చదవండి: సనాతన ధర్మం ఓ మతం కాదు.. ఉదయనిధికి స్ట్రాంగ్ కౌంటర్)
సీఎం దగ్గర జగదీష్ పళనిసామి చాలా ఏళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు. ఇతడు చెన్నైలో ఓ ఇంటిని కట్టుకున్నాడు. దీని గృహప్రవేశం శుక్రవారం ఉదయం జరగ్గా.. ఈ శుభకార్యానికి సీఎం విజయ్ హాజరయ్యారు. గోల్డెన్ కలర్ పట్టు చొక్కా, పంచెలో విజయ్ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ ఇచ్చిన సీఎం విజయ్ కొడుకు)
#CMJosephVijay at #Jagadish's New Home Function ✨️#ThalapathyVijaypic.twitter.com/14gsYE41FA
— Movie Verse (@_MovieVerse) May 29, 2026


